తెలుగు పాటలు ఇప్పుడు పేస్ బుక్ పేజి లో కూడా www.facebook.com/telugu.patalu

Monday, May 19, 2014

♛ తల్లితండ్రులని గౌరవించండి ♛

ఒకయువకుడు రెండు ఎత్తైన కొండల మధ్య ఫీట్స్ చేస్తున్నాడు ..
ఒక కొండ మీద నుండి ఇంకొక కొండ పైకి ఒక ఇనుప తీగ కట్టి ప్రజలందరూ చూస్తుండగా ఒక కర్ర ఆధారంగా తీగపై ఒక వైపు నుండి మరొకవైపుకు నడిచాడు
అక్కడున్న ప్రజలందరూ చప్పట్లు కొట్టారు ..
తర్వాత ఒక చక్రం ఉండే తోపుడు బండి తీస్కుని ఒక వైపు నుండి మరొక వైపుకి నడిచాడు ..
చూస్తున్న వారందరూ మరల కరతాళ ద్వనులు చేసారు,
తర్వతా ఆ యువకునితో కొంత మంది ఇలాఅంటారు ..
ప్రాణం లేనిబండి, కర్ర తో నడవడం కాదు ఒక మనిషిని ఆ బండి లో కూర్చో పెట్టుకుని తీగపై నడువు అప్పుడు నీవు గోప్పవాడివని నమ్ముతాం అంటారు ..
అప్పుడా యువకుడు "ఎవరైనావచ్చి ఈ బండి లో కూర్చుంటే అలాగే చేస్తాను" ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ..
అప్పుడు ఎవరు ముందుకు రారు, కాసేపటి తర్వాత ఒకముసలి అతను వచ్చి బండి లోకూర్చుంటాడు ..
అక్కడున్న వారు ఎం తాత బ్రతుకు మీద ఆశ చచ్చి పోయిందా ఈ విధంగా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా, ఇంటి దగ్గర చెప్పి వచ్చావ"అని ఎగతాళిచేస్తారు ..
ఆ యువకుడు బండిలో ముసలి వ్యక్తిని కూర్చో పెట్టుకుని ఇవతలి నుండి అవతలికి సునాయాసంగా నడుస్తాడు.
అక్కడున్న కొందరు వచ్చి " ఎం తాత ఏ నమ్మకం తోటి ఆ అబ్బాయి మాటలు విని ఇంత పనికి తెగించావు " అని అడుగుతారు..??
ఎందుకంటే వాడు నా కొడుకు " అని అతను సమాధానం చెప్తాడు ..
ఫ్రెండ్స్.. ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్మిన నమ్మకపోయినా మీ తల్లితండ్రులు మిమ్మల్ని నమ్ముతారు..
మీ ఔన్నత్యం కోసం ఎంత త్యాగానికైనా సిద్ద పడతారు....
అవమానాలని కూడా భరిస్తారు...
మీ తల్లి తండ్రులు మీమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకండి. తల్లితండ్రులని గౌరవించండి.


No comments:

Post a Comment

తెలుగు వారి బ్లాగులు లో మీ బ్లాగ్ జత పరుచుటకు మీ బ్లాగ్ లింక్ మరి బ్లాగ్ పేరు పోస్ట్ చేయగలరు